ఏం చేశారని మీది రైతు పార్టీ అని చెప్పుకుంటున్నరు : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

-

కాంగ్రెస్ ప్రభుత్వం మీద బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఫైర్ అయ్యారు. రేవంత్ సర్కార్ రైతులను పట్టించుకోవడం లేదని.. పండిన పంటలను కొనుగోలు చేయడం లేదని.. కొనుగోలు కేంద్రాల్లో రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. దీనికి తోడు కేసీఆర్ మీద సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు.ఏ పథకమూ రాష్ట్రంలో ఆపడం లేదని అన్ని అమలు చేస్తున్నామని అన్నారు.

తాజాగా దీనిపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి శుక్రవారం తెలంగాణ భవన్ వేదికగా మీడియాతో మాట్లాడారు. ‘రుణమాఫీ ఎగవెట్టిర్రు.రైతు బందు ఆపేసిర్రు. సాగుకు నీళ్లు ఇవ్వడం బంద్ పెట్టిర్రు.అయిన రైతు ఎలాగోలా పంట పండిస్తే అవి కూడా సమయానికి కొనక జాప్యం చేస్తున్నారు.పోయిన సారి బోనస్ అని ఉదరగొట్టిర్రు, ఈ సారి బోనస్ ఇవ్వడం లేదు.ధాన్యం తడిసి రైతు నష్టపోతే పట్టించుకునే నాథుడు లేడు.ఇవన్నీ ఏమి చేయకుండా మాది రైతు పార్టీ అని ఎలా చెప్పుకుతిరుగుతున్నారు’ అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news