రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ప్రిన్సిపల్ సెక్రెటరీగా సీనియర్ ఐఏఎస్ దానకిషోర్‌ను నియమిస్తూ అదనపు బాధ్యతలను అప్పజెప్పింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు.
ఇప్పటికే పురపాలక, పట్టణాభివృద్ధి ముఖ్య కార్యదర్శిగా, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీగా దాన కిషోర్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఆయన్ను గవర్నర్ జష్ణుదేవ్ వర్మకు ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమిస్తూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేయడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది.ఇదిలాఉండగా, గవర్నర్ వద్ద ప్రభుత్వం పంపించిన కొన్ని ఫైల్స్ పెండింగ్‌లో ఉండగా తాజాగా ప్రిన్సిపల్ సెక్రెటరీ నియామకంతో అందులో ఏమైనా కదలిక వస్తుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది.