వైసీపీ నేత విజయసాయిరెడ్డి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.నేటి ఉదయం రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ ను కలిసి రాజీనామా లేఖను ఆయనకు సమర్పించారు. అంతేకాకుండా ఆయన వైసీపీ వీడుతారని జోరుగా ప్రచారం సాగుతోంది.ఈ నేపథ్యంలోనే బీజేపీ నేత భాను ప్రకాశ్ రెడ్డి స్పందిస్తూ.. విజయసాయి రెడ్డి బాటలోనే చాలా మంది ఆ పార్టీని వీడనున్నారని జోస్యం చెప్పారు.
మాజీ సీఎ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంపై వైసీపీ నేతలకు నమ్మకం పోయిందని, అందుకే ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారని చెప్పారు.రాబోయే రోజుల్లో వైసీపీ ఖాళీ అవ్వడం ఖాయమని వివరించారు. కార్యకర్తలకు, నాయకులకు అందుబాటులో లేకుండా కేవలం తాడేపల్లి ప్యాలెస్ కే జగన్ పరిమితమయ్యాడని, గాలిలో తిరిగే నాయకుడిగా జగన్ మిగిలిపోయారన్నారు. ఇప్పటికే ముగ్గురు ఎంపీలు వైసీపీని వీడారని, అయోధ్య రాంరెడ్డి కూడా త్వరలో పార్టీ వీడుతారని ఆరోపించారు.