ఎంపీ సభ్వత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా.. రాజ్యసభ చైర్మన్ కు రాజీనామా అందజేత

-

వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి తన రాజ్యసభ సభ్వత్వానికి రాజీనామా చేశారు. అనంతరం ఢిల్లీలోని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ కు ఆయన తన రాజీనామా పత్రాన్ని అందజేశారు.శనివారం ఉదయమే రాజ్యసభ చైర్మన్ అపాయింట్ మెంట్ కోరిన ఆయన ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని అందజేశారు.

ఇదిలాఉండగా, తన రాజ్యసభ పదవికి రాజీనామా చేయబోతున్నట్లు విజయసాయి రెడ్డి శుక్రవారం సాయంత్రం సంచలనం నిర్ణయం తీసుకున్నారు.సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ప్రకటన చేశారు. తనకు రెండు సార్లు రాజ్యసభ ఎంపీగా అవకాశం కల్పించిన మాజీ సీఎం జగన్, ఆయన భార్య భారతమ్మకు ధన్యవాదాలు తెలిపారు. కాగా, విజయసాయి ప్రకటనతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అయితే, వైఎస్ జగన్ ఆయన్ను దూరం పెట్టారని, అందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news