మస్తాన్ సాయి కేసులో మరో కీలక ట్విస్ట్.. రూ.12 కోట్లు డిమాండ్ చేసిన లావణ్య?

-

లైంగికవేధింపులు, డ్రగ్స్, బెదిరింపుల కేసులో అరైస్టైన మస్తాన్ సాయి కేసులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. తాజాగా మస్తాన్ మీద కేసు పెట్టిన లావణ్యపై అతని పేరెంట్స్ సంచలన ఆరోపణలు చేశారు.ఆదివారం మీడియాతో వారు మాట్లాడుతూ.. ‘మా అబ్బాయికి పెళ్లి అయ్యింది. అయినప్పటికీ మళ్లీ పెళ్లి చేసుకోవాలని లావణ్య వెంటపడి వేధించింది. రూ.12 కోట్లు ఇవ్వాలని బెదిరింపులు, బ్లాక్ మెయిల్ చేసింది.

మస్తాన్‌ ఫోన్‌లో వందల మంది వీడియోలు ఉన్నాయనే ఆరోపణల్లో నిజం లేదు. కేవలం తన భార్య న్యూడ్ వీడియోలు మాత్రేమే ఉన్నాయి.ఇంకెవరివీ లేవు.మా అబ్బాయి నిర్దోషి, ఎప్పటికైనా న్యాయం గెలుస్తుంది. లావణ్య వల్లే మా అబ్బాయికి డ్రగ్స్ అలవాటు అయ్యింది. లావణ్య డ్రగ్స్ తీసుకుంటుందని స్వయంగా వాళ్ల అమ్మే చెప్పింది.ఆమెకు డ్రగ్స్ టెస్టులో నెగిటివ్ వస్తే ముక్కు నేలకు రాస్తాం’అని మస్తాన్ ‌సాయి తల్లితండ్రులు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, మస్తాన్ ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news