వేములవాడ కాంగ్రెస్ ఎమ్మెల్యే, విప్ ఆది శ్రీనివాస్ ఇలాకాలో జోరుగా అక్రమ ఇసుక దందా కొనసాగుతోంది. రూరల్ మండలం లింగంపల్లి గ్రామంలో వందలాది ట్రాక్టర్లతో అక్రమ ఇసుక దందా సాగుతున్నదని.. తమ గ్రామానికి ఒక్క రూపాయి ఫండ్ ఇవ్వకుండా, ఇసుక దోపిడీ చేస్తున్నారని గ్రామస్థుల నుంచి ఫిర్యాదులు తలెత్తడంతో పాటు పలు కథనాలు వచ్చాయి.
దీంతో ఎట్టకేలకు వేములవాడలో ఇసుక అక్రమ రవాణాపై ఆర్డీవోలు,తహసీల్దార్లతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. లింగంపల్లి గ్రామ వాగులో నుండి అక్రమ ఇసుక రవాణాపై కలెక్టర్ సందీప్ కుమార్ ఝా స్పందిస్తూ.. అనుమతి లేని వాగుల నుంచి ఇసుక తరలించకుండా నిఘా పెట్టాలని..అక్రమంగా ఇసుక తరలించే వారిపై కేసులు పెట్టాలని, ఆయా చోట్ల ఇసుక అక్రమంగా తరలించకుండా కందకాలు తవ్వించాలని ఆర్డీవోలు, తహసీల్దార్లను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు.
తెలుగు స్కైబ్ ట్వీట్‌తో కదిలిన అధికార యంత్రాంగం
వేములవాడలో ఇసుక రవాణాపై ఆర్డీవోలు, తహసీల్దార్లతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్
లింగంపల్లి గ్రామ వాగులో నుండి అక్రమ ఇసుక రవాణాపై స్పందించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
అనుమతి లేని వాగుల నుంచి ఇసుక తరలించకుండా నిఘా పెట్టాలని.. అక్రమంగా… https://t.co/im9CHZKY3U pic.twitter.com/XK9pRQbyTU
— Telugu Scribe (@TeluguScribe) February 15, 2025