మీర్పేట్లో భార్యను ముక్కలుగా నరికిన ఘటనలో మరో కొత్తకోణం వెలుగుచూసింది. తన భార్య వెంకటమాధవిని గురుమూర్తి దారుణంగా హత్యచేయడం వెనుక మరో ముగ్గురి హస్తం ఉన్నట్లు మీర్ పేట పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే గురుమూర్తిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
అయితే, నిందితుడు గురుమూర్తి తన భార్యను హత్య చేసే క్రమంలో అతనికి మరో ముగ్గురు సాయం చేశారని.. ప్రస్తుతం వారంతా పరారీలో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గురుమూర్తిని మరోసారి కస్టడీలోకి తీసుకుని విచారిస్తే కీలక విషయాలు వెల్లడి అవుతాయని పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, దీనికి సంబంధించి పూర్తి విషయాలు తెలియాల్సి ఉంది.