మరో అరుదైన రికార్డు క్రియేట్ చేసిన యానిమల్ మూవీ

-

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ నటించిన తాజా చిత్రం యానిమల్. ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక హీరోయిన్గా నటించింది. బాబి డియో అనిల్ కపూర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.డిసెంబర్ ఒకటవ తేదీన విడుదలైన యానిమల్ చిత్రం 900 కోట్ల భారీ వసూళ్లను సాధించింది.యానిమల్ చిత్రం తాజాగా ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అయినటువంటి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ప్ర‌ముఖ ఓటీటీ దిగ్గ‌జం నెట్‌ఫ్లిక్స్ వేదిక‌గా రిపబ్లిక్ డే కానుకగా జ‌న‌వ‌రి 26 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల అయ్యింది.

Animal Movie

 

ఇదిలావుంటే తాజాగా ఈ మూవీలోని పాటలు అరుదైన రికార్డు క్రియేట్ చేశాయి. ప్రముఖ మ్యూజిక్ యాప్ స్పాటిఫైలో యానిమల్ ఆల్బమ్ 500 మిలియన్స్ కి పైగా స్ట్రీమ్ అయ్యింది. ఇక స్పాటిఫైలో అత్యంత వేగంగా ఈ నంబర్‌ను చేరుకున్న సినిమాగా యానిమల్ నిలిచింది.ఈ చిత్రంకి సంబందించి యానిమల్ పార్క్‌ సీక్వెల్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version