గెలిచినప్పటికీ.. ఆస్ట్రేలియాకు ఎదురుదెబ్బలు తప్పడం లేదు..!

-

ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు అద్భుతంగా రాణిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఇటీవలే భారత్తో ఆడిన మొదటి వన్డే సిరీస్లో వరుసగా రెండు విజయాలు అందుకుని ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది ఆస్ట్రేలియా జట్టు. బౌలింగ్ విభాగం బ్యాటింగ్ విభాగం పటిష్టం గా ఉంది. కానీ క్రమక్రమంగా ఆస్ట్రేలియాకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి అన్న విషయం తెలిసిందే.

వరుసగా గాయాల బారిన పడుతున్న ఆస్ట్రేలియా జట్టు ఆటగాళ్లు ప్రస్తుతం జట్టుకు దూరం అవుతూ ఉండడం ఆస్ట్రేలియా జుట్టును మరింత బలహీనంగా మారుస్తోంది. మొన్నటికి మొన్న స్టాయినిస్ జట్టు నుంచి దూరం అవ్వగా ఇటీవలే గాయం బారినపడిన డేవిడ్ వార్నర్ కూడా దూరమయ్యాడు… మొన్నటినుంచి పక్కటెముకల నొప్పితో బాధపడుతున్న మిచెల్ స్టార్క్ కూడా ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు ఇండియాతో ఆడబోయే మొదటి టి20 కి అందుబాటులో ఉండే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version