ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు హవా తగ్గుతున్నట్టు కనిపిస్తోంది. మొదటి నుంచి చంద్రబాబు అంటే రాజకీయ చాణక్యుడు అని పేరుంది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. ఆయన నాయకత్వం పట్ల తెలుగు తమ్ముళ్లు చాలా నిరాశగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే చాలామంది కొత్త నాయకత్వం మార్పు కోరుకుంటున్నా కూడా అలా జరగకపోవడంతో పార్టీని వీడుతున్నారు. రీసెంట్ గా మాజీ ఎమ్మెల్యే పార్టీని వీడిన సంగతి తెలిసిందే.
ఇక ఇప్పుడు అదే దారిలో తాజాగా తిరుపతి ఎంపీ ఉప ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై పోటీ చేసిన పనబాక లక్ష్మి పార్టీనివ వీడే అవకాశం ఉందని పెద్ద ఎత్తున ప్రచారంజరుగుతోంది. ఎందుకంటే ఆమె గత కొద్ది కాలంగా అంటే ఉప ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి పార్టీ మీటింగులకు చాలా దూరంగా ఉంటున్నారు. ఎలాంటి పర్యటనలు కూడా చేయకుండా యాక్టివ్ పాలిటిక్స్‌కు చాలా దూరంగా ఉంటున్నారు.
ఈమె కాంగ్రెస్ నుంచి 2019 ఎన్నికలకు ముందు టీడీపీ గూటికి వచ్చి సైకిల్ గుర్తుపై పోటీ చేసింది. అప్పుడు కూడా ఓటిపోయింది. ఇక ఇప్పుడు ఉప ఎన్నికల్లో కూడా ఘోర ఓటమి పాలవడంతో ఆమె పార్టీ కలిసి రావట్లేదనే అభిప్రాయంతో ఉన్నారంట. ఇక ఆమెకు అండగా ఉంటున్న రాజకీయ వర్గం కూడా పార్టీ మారితేనే బాగుంటుందని సలహాలు ఇవ్వడంతో కార్యకర్తలతో ఇప్పటికే చర్చలు కూడా నడుస్తున్నాయంట. అయితే ఆమె ఏ పార్టీలోకి వెళ్తుందో అనేది ఇంకా క్లారిటీ రాలేదు.