గత ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం దెబ్బకు టీడీపీ ( TDP Party ) ఇంకా కోలుకొని విషయం తెలిసిందే. ఎన్నికలై రెండేళ్ళు గడిచిన కూడా ఏ ఒక్క జిల్లాల్లో టీడీపీ పూర్తి స్థాయిలో పుంజుకోలేదు. పైగా టీడీపీ పరిస్తితి ఇంకా దిగజారుతూ వస్తుంది. ఇప్పటికే పలువురు నాయకులు టీడీపీని వీడి వైసీపీలో చేరారు. అయితే పార్టీలో కొందరు నాయకులకు అసలు గౌరవం దక్కకపోవడంతో, వారు కూడా పార్టీని వీడుతున్నారు.
తాజాగా సీనియర్ నాయకురాలు శోభా హైమవతి టీడీపీని వీడారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలో హైమవతికి మంచి ఫాలోయింగ్ ఉంది. అలా మంచి ఫాలోయింగ్ ఉన్న హైమవతిని టీడీపీ అధిష్టానం నిర్లక్ష్యం చేసింది. దీంతో ఆమె పార్టీకి రాజీనామా చేశారు. మామూలుగానే విజయనగరం జిల్లాలో టీడీపీ వీక్‌గా ఉంది.
గత ఎన్నికల్లో జిల్లాలో ఉన్న అన్నీ స్థానాల్లో వైసీపీ గెలిచింది. ఇక్కడ 9 అసెంబ్లీ స్థానాలు ఉంటే, 9 స్థానాలు వైసీపీనే గెలుచుకుంది. అలాగే ఉన్న ఒక్క ఎంపీ సీటు వైసీపీ ఖాతాలోనే పడింది. ఇక ఎన్నికలై రెండేళ్ళు గడిచిన కూడా ఇక్కడ టీడీపీ పుంజుకోలేదు. విజయనగరం టీడీపీకి పెద్ద దిక్కుగా ఉండే అశోక్ గజపతి రాజు ఫ్యామిలీ సైతం వెనుకబడి ఉంది. అలాగే జిల్లాలో టీడీపీ నేతలు పెద్ద యాక్టివ్‌గా ఉండటం లేదు. ఒక్కరిద్దరు మినహా మిగతా నేతలు సైలెంట్‌గా ఉంటున్నారు.
దీంతో మెజారిటీ నియోజకవర్గాల్లో టీడీపీ వీక్‌గా కనిపిస్తోంది. పైగా సగం నియోజకవర్గాల్లో మంత్రి బొత్స సత్యనారాయణ హవా ఉంది. చీపురుపల్లి, గజపతినగరం, నెల్లిమర్ల, శృంగవరపుకోట లాంటి స్థానాల్లో బొత్స ఫ్యామిలీదే హవా. అలాగే ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో వైసీపీ ఆధిక్యం ఉంది. మొత్తానికి చూసుకుంటే విజయనగరం జిల్లాలో టీడీపీ చాలా వీక్‌గా కనిపిస్తోంది.