హైదరాబాద్ జట్టు కి మరో ఎదురు దెబ్బ..!

-

ఐపిఎల్ ఎంటర్టైన్మెంట్ ప్రారంభమైంది.. అయితే ఈసారి ఐపీఎల్ టైటిల్ ఫేవరెట్ జట్టుగా బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకి మొదటినుంచి భారీ షాక్ లు తగులుతున్నా విషయం తెలిసిందే. ఇంతకుముందు సీజన్లో ఉన్న ఫామ్ లో సన్రైజర్స్ జట్టు కనిపించలేదు. అంతేకాదు జట్టు వరుసగా ఓటమిపాలైంది. ఇక అంతలోనే ఏకంగా జట్టులో అనుభవంగల ఆటగాడిగా ఉన్న ఆల్రౌండర్ మిచెల్ మార్స్ గాయం కారణంగా సన్రైజర్స్ జట్టు కి పూర్తిగా దూరమైన విషయం తెల్సిందే. దీంతో సన్రైజర్స్ జట్టు కి భారీ షాక్ తగిలింది.

ఇక ఇటీవలే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో చివరి ఓవర్లో కీలక ఆటగాడిగా ఉన్న భువనేశ్వర్ కుమార్ గాయం బారిన పడిన విషయం తెలిసిందే. బౌలింగ్ చేయాలని ప్రయత్నించినప్పటికీ చివరికి గాయం వల్ల మైదానం వదిలి వెళ్లాల్సి వచ్చింది. ఎడమ కాలు తుంటి గాయం కావడంతో భువనేశ్వర్ కుమార్ కూడా ఐపీఎల్ టోర్నీకి మొత్తం దూరం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కష్టాల ఊబిలో నెట్టుకొస్తున్న సన్రైజర్స్ జట్టుకు బౌలింగ్ విభాగానికి ఎంతో సమర్ధవంతంగా ముందుకు తీసుకెళుతున్న భువనేశ్వర్ కుమార్ దూరం కావడంతో మరిన్ని ఇబ్బందులు తప్పేలా లేవు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version