పూజలు, వ్రతాలు ఉంటే ఉల్లి, వెల్లులి తినరు కదా..? ఎందుకో తెలుసా..?

-

  1. ఎప్పుడైనా పూజలు, వ్రతాలు లాంటివి వాటిని జరిపేటప్పుడు వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయని తినరు. అలాగే చాలా మంది బ్రాహ్మణులు ఉల్లిపాయని, వెల్లుల్లిని తినరు. ఎప్పుడైనా ఎందుకు ఉల్లిపాయని, వెల్లుల్లిని పైన తినకూడదు అని ఆలోచించరా..? శాకాహారమే కదా ఎందుకు తినకూడదు అని సందేహం మీలో కలిగిందా..? అయితే మరి దాని కోసమే ఇప్పుడు మనం చూద్దాం.

మనం తీసుకునే ఆహారం మూడు రకాలుగా ఉంటుంది. సాత్విక, రాజసిక, తామసిక అని మూడు విధాలుగా విభజించవచ్చు. అయితే వెల్లుల్లి ఉల్లి రాజసిక గుణానికి చెందినవి. వీటిని తీసుకోవడం వల్ల మనసులో కొన్ని మార్పులు వస్తాయి. ఈ క్రమంలోనే ఎలాంటి ఆలోచనలు రాకపోవడం ఏకాగ్రత లేకపోవడం కోపం కలగడం లాంటివి జరుగుతాయి.

దీని కారణంగానే ఉల్లిపాయని, వెల్లుల్లిని తినకూడదు అని అంటుంటారు పెద్దలు. పూజ వేళలో భక్తిశ్రద్ధలతో దేవుని పైన ఏకాగ్రత పెట్టాలి అలాంటి సమయంలో ఇటువంటివి తినడం వల్ల ఏకాగ్రత తగ్గుతుంది విపరీతమైన కోపం కూడా వస్తుంది అందుకనే వీటిని పూజ సమయంలో తినకూడదు అని అంటున్నారు పండితులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version