సినిమా ప్రముఖులు పెళ్లి ళ్లు చేసుకోవడం.. విడాకులు తీసుకోవడం కామన్ అయిపోయింది. బాలీవుడ్ నుంచి మొదలు పెడితే… టాలీవుడ్ వరకు చాలా స్టార్లు.. ఇప్పటికే విడాకులు తీసుకున్నారు. అమిర్ ఖాన్, సమంత- నాగ చైతన్య, ఇటీవలే ధనుష్ – ఐశ్వర్య ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందే ఉన్నారు. అయితే.. తాజాగా టాలీవుడ్ సీనియర్ హీరో జేడీ చక్రవర్తి కూడా తన వివాహ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టాలని భావిస్తున్నాడట.
ఐదు ఏళ్ల కిందట.. జేడీ చక్రవర్తి, అనుకృతిలకు వివాహం జరిగింది. లేటు వయసులో అయినా కూడా జేడీ ఓ ఇంటి వాడు అయ్యాయని అప్పుడు అందరూ సంతోషించారు. కానీ.. వారి పెళ్లి అయిన ఐదేండ్ల తర్వాత ఇప్పటి వరకు వీరి గురించి ఎలాంటి వార్తలు రాలేదు.
కానీ ఈ జంట తాజాగా విడాకులు తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు… అతి త్వరలోనే.. వారు విడాకులు తీసుకునే చాన్స్ ఉన్నట్లు రెండు రోజుల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. అయితే.. ఇందులో ఎంత వరకు నిజముందో తేలీదు కానీ జేడీ విడాకులపై క్లారిటీ రావాల్సి ఉంది. అసలు ఇవి పుకార్లా.. లేదా నిజమ అనేది త్వరలోనే క్లారిటీ రానుంది.