అమ్మాయిలకు డ్రగ్స్ ఇచ్చి శారీరకంగా వాడుకుని వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడనే ఆరోపణలతో మస్తాన్ సాయిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. లావణ్య అనే యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు మస్తాన్ సాయిపై కేసు ఫైల్ చేశారు. ప్రస్తుతం మస్తాన్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.
ఇదిలాఉండగా, ఈ కేసులో మరో ట్విస్ట్ వెలుగుచూసింది. ఈ కేసును డీల్ చేస్తున్న డీఐ శ్రీనివాస్‌ను ఐజీ ఆఫీసుకు అటాచ్ చేస్తూ సైబరాబాద్ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. ఎందుకంటే మస్తాన్ సాయి మీద కేసు పెట్టిన లావణ్యతో తరచూ వాట్సాప్‌లో డీఐ శ్రీనివాస్ వీడియో కాల్స్ మాట్లాడుతున్నట్లు గుర్తించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై విచారణ జరిపిన పోలీసు ఉన్నతాధికారులు డీఐ శ్రీనివాస్.. లావణ్యతో మాట్లాడింది నిజమేనని తేల్చారు. అనంతరం ఐజీ ఆఫీసుకు అటాచ్ చేశారు.
మస్తాన్ సాయి, లావణ్య కేసులో మరో ట్విస్ట్..!
డీఐ శ్రీనివాస్‌ను ఐజీ ఆఫీసుకు అటాచ్ చేసిన సైబరాబాద్ సీపీ. లావణ్యతో తరచూ వాట్సాప్‌లో డీఐ శ్రీనివాస్ వీడియో కాల్స్. వైరల్ అవుతున్న లావణ్య, శ్రీనివాస్ కాల్స్. విచారణ జరిపిన పోలీసు ఉన్నతాధికారులు. డీఐ శ్రీనివాస్ లావణ్యతో మాట్లాడింది… pic.twitter.com/xBMUkZJ1J7
— ChotaNews App (@ChotaNewsApp) February 12, 2025