లక్ష్మి విషయంలో కాణిపాకం ఆలయానికి ప్రమాణం చేయండి అంటూ వైసీపీకి జనసేన తిరుపతి ఇన్చార్జి కిరణ్ రాయల్ సవాల్ విసిరారు. అభినయ్ రెడ్డి.. లక్ష్మీరెడ్డి నీకు తెలియదని నిరూపించుకో అంటూ మండిపడ్డారు కిరణ్ రాయల్. కాణిపాకం ఆలయానికి వచ్చి రేపు సాయంత్రంలోగా ప్రమాణం చేయు అంటూ సవాల్ చేశారు జనసేన తిరుపతి ఇన్చార్జి కిరణ్ రాయల్.
నిరూపిస్తే తిరుపతి రాజకీయాల్లో ఉన్నంతవరకు వాళ్ల కుటుంబం గురించి ఒక్క మాట కూడా మాట్లాడను అన్నారు. లక్ష్మీరెడ్డి వైసీపీ ట్రాప్‌లో పడిపోయిందని ఆరోణలు చేసారు కిరణ్ రాయల్. వైసీపీ వాళ్లు కావాలనే నాపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు… ఏఐ ద్వారా ఫోటోలు మార్ఫింగ్ చేసి లేనిది ఉన్నట్లు చూపిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ వాళ్లు నా మీద దాదాపు రూ.75 కోట్ల నుంచి రూ.100 కోట్లు ఖర్చు పెట్టారంట అంటూ రెచ్చిపోయారు జనసేన తిరుపతి ఇన్చార్జి కిరణ్ రాయల్.
అభినయ్ రెడ్డి.. లక్ష్మీరెడ్డి నీకు తెలియదని నిరూపించుకో: కిరణ్ రాయల్
కాణిపాకం ఆలయానికి వచ్చి రేపు సాయంత్రంలోగా ప్రమాణం చేయు
నిరూపిస్తే తిరుపతి రాజకీయాల్లో ఉన్నంతవరకు వాళ్ల కుటుంబం గురించి ఒక్క మాట కూడా మాట్లాడను
– జనసేన తిరుపతి ఇన్చార్జి కిరణ్ రాయల్ pic.twitter.com/wHN7NIhNYl
— BIG TV Breaking News (@bigtvtelugu) February 12, 2025
–