మనోజ్ కు మోహన్‌ బాబు షాక్.. నోటీసులు ఇచ్చిన కలెక్టర్ !

-

ఇంట్లో నుంచి బయటకు అందరినీ వెళ్లగొట్టండి అంటూ మోహన్‌ బాబు ఫిర్యాదు చేశారు. మంచు ఫ్యామిలీలో మరొక ట్విస్ట్ చోటు చేసుకుంది. తన ఆస్తులను ఉన్న అందర్నీ వేకెట్ చేయించాలని జిల్లా మెజిస్ట్రేట్ కి మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. జల్ పల్లి లో ఉన్న తన ఆస్తులను కొంతమంది అక్రమంగా ఆక్రమించుకున్నారని ఫిర్యాదు చేశారు. తన ఆస్తులలో ఉన్న వారందరినీ వెంటనే వెకట్ చేసి తనకు అప్పగించాలని కోరారు మోహన్ బాబు.

manchu manoj, mohan babu

గత కొన్ని రోజుల నుంచి తిరుపతిలో ఉంటున్నారు మోహన్ బాబు. అటు జల్ పల్లి ఇంటిలో నివాసం ఉంటున్నారు మంచు మనోజ్. సీనియర్ సిటిజన్ ఆక్ట్ ప్రకారం తన ఆస్తులను స్వాధీనం చేసి ఇవ్వాలని కోరారు మోహన్ బాబు. అయితే… మోహన్ బాబు ఫిర్యాదు పై స్పందించారు జిల్లా కలెక్టర్. పోలీసుల దగ్గర నుంచి మోహన్ బాబు ఆస్తులపై నివేదిక తీసుకున్నారు కలెక్టర్. జల్పల్లి ఇంటిలో ఉంటున్న మంచు మనోజ్ కి నోటీసు ఇచ్చారు జిల్లా కలెక్టర్.

Read more RELATED
Recommended to you

Latest news