వావ్‌.. తెలుగు రాష్ట్రాలకు మరో వందేభారత్‌ ట్రైన్‌

-

మరో కొత్త వందే భారత్‌ ఎక్స్‌ ప్రెస్‌ ప్రారంభం కానుంది. ఏప్రిల్‌ 8న, గుంటూరు మీదుగా సికింద్రాబాద్‌-తిరుపతి మధ్య ప్రారంభించే అవకాశం కనిపిస్తుంది. ఈ రైలు ఒక్కసారి అమలులోకి వచ్చిన తర్వాత, చాలా విజయవంతమైన లైన్ అవుతుందని అనుకుంటున్నారు అధికారులు. వందేభారత్ ఈ మార్గంలో వస్తే , సికింద్రాబాద్ నుండి గుంటూరు మధ్య ప్రయాణ సమయం చాలావరకు తగ్గుతుంది.
సికింద్రాబాద్ -తిరుపతి వందే భారత్ రైలును బీబీ నగర్- నడికుడి మార్గంలో మిర్యాలగూడ మీదుగా నడపాలని నిర్ణయియించారు రైల్వే అధికారులు . ఈ వండేభారత్ రైలును వరంగల్, ఖాజీపేట మార్గంలో నడపాలని రైల్వే అధికారులు అనుకున్నపటికి కూడా , ఆ రూట్‌ లో దూరం ఎక్కువ అవుతుంది. ఆ కారణంతో బీబీ నగర్ నడికుడి మార్గంలో నడపాలని నిర్ణయించారు అధికారులు. బీబీ నగర్ నుంచి గుంటూరు వరకు ఉన్న రూట్ లో రైల్వే ట్రాక్‌ ను గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా ఏర్పాటు చేసినట్లు తెలిపారు అధికారులు.

గంటకు 130 నుంచి 150 కిలో మీటర్ల వేగంతో ఈ మార్గంలో రైలు ప్రయాణించేలా ట్రాక్‌‌ను సిద్దపరిచారు. ఈ మార్గంలో వందే భారత్ రైలు టికెట్ ధర రూ.1150 నుంచి మొదలవుతుందని సమాచారం. సికింద్రాబాద్- తిరుపతి మధ్య ఈ మార్గంలో నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌ నడుస్తోంది. ఈ రైలు ప్రయాణ సమయం 12 గంటలు. అయితే.. వందే భారత్‌ రైలు అందుబాటు లోకి వస్తే.. 6 నుంచి 7 గంటల సమయంలో తిరుపతికి వెళ్లొచ్చని అధికారులు చెబుతున్నారు. ఏయే స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది అనే సమాచారం ఇంకా రాలేదు. కానీ.. గుంటూరు, నెల్లూరులో ఆగుతుంది ఈ వండేభారత్ రైలు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version