ఎన‌ద‌ర్ రాగా : మ‌రో మేడే కూడా ఇలానే ఉంటుంది

-

ఎప్ప‌టిక‌ప్పుడు నీకు నీవు నిర్వాణంలో ఉండిపో
ఎప్ప‌టిక‌ప్పుడు నీకు నీవు అదుపాజ్ఞ‌లు విధించుకో
నీవు సంద్రంలో తేలే శవం అయితే నీవు వీధిలో తేలే
మ‌ర‌ణం అయితే రికార్డుల‌కు అంద‌ని చావు అయితే
వీడే ఆ గుర్తు పోల‌ని శ‌వాల‌కు అంత్య క్రియలు నిర్వ‌హించి
ఆ నిర్వాణ ద‌శ‌కు నిర్వాహ‌కుడిగా ఉండిపోతాడు
వాడు నిర్బంధం చెంత నీ ప్రియ పాల‌కుడు..వాడినే ప్రేమించు

ఎండ‌ల‌న్నీ మాయం అవుతాయి..కాల‌మిచ్చిన గ్రీష్మ హొయ‌లు మారిపోతాయి..వ‌ర్షం వ‌చ్చే వేళ‌కు ఈ నేల‌లు కొత్త ఆహ్వానాలు ప‌లికి తీరుతాయి..అప్ప‌టిదాకా నీ చావుకు ఎవ్వ‌డు కార‌ణం అన్న‌ది అస్స‌లు తెలియదు..నియ‌మిత నిర్బంధాల‌ను మేం ఆహ్వానించాక మేం మా చావునే ప్రేమించ‌గ లేనిది నీ గోడు ప‌ట్ట‌క ఎలా ఉంటాం. ఉన్నా నీకు కాస్త తిండి మాత్రం ఎలా తెస్తాం.. తెచ్చినా ఈ దూరాల‌ను ఎలా స‌మ‌సిపోయేలా చేస్తాం..ఈ నీడ‌లు ఎలా చెదిరిపోయేలా చేస్తాం..అయినా నీవూ నేనూ క‌లిసే చ‌నిపోవాలి..అదే ప్ర‌భువాజ్ఞ ధిక్కారం ఉంటే ప్ర‌భువు ఆనందిస్తాడా ?

హా అవును వాడికి కావ‌ల్సిన మృత్యు హేల అక్క‌డి నుంచే పొంద‌డం సులువు..వీధుల‌న్నీ ఎండ‌ల‌ను త‌మ‌లో ఇంకించుకుని నీడ‌ల‌పై ఏవో శాస‌నాలు చేస్తాయి.. వీధుల‌న్నీ ఎండ‌ల‌ను త‌మ‌లో ల‌యం చేసుకుంటే క‌న్నీటికి వెల్లువ ఒక‌టి వ‌చ్చిపోతోంది.. వెల్లువ‌ల్లో ఉన్న‌వ‌న్నీ జాలీ ద‌యలాంటి గుణాల‌ను మోసుకుని వ‌చ్చినా ఈ పాల‌కుల‌కూ మండే గోళాల‌కూ ఏమీ ప‌ట్ట‌వు..క‌నుక తీరు మార‌ని లోకంలో ఎవ్వ‌రయినా వీరిని చూసి అయ్యో! అనుకోవ‌డం హృద‌య‌గ‌త సం స్కారం అనిపించుకోదు.. అస‌లీ దారిద్ర్యం ఒక‌టి ఒక‌రి పుణ్యంగా ద‌క్కింద‌ని భా విస్తూ బ‌త‌క‌డ‌మే ఈ చిర‌కాల వేద‌న‌ల‌కు చివ‌రి ఆశ.. అప్పుడు కూడా మ‌నిషి మాత్రం మారిపోతాడా? గ‌తం అన్న‌ది వేధించ‌క పోతుందా.. వేద‌న వ‌ల‌యాలు ఛేద‌న‌కు నోచుకోక ఎక్క‌డో ద‌గ్గ‌ర అంత‌రంగ అంగీకారానికి నోచుకోక అలానే ఉం డిపోతాయి.. ఇలా ఉండిపోవ‌డం కార్మిక లోకం హ‌ర్షించాలి.లేదా ఇవి ప్రాప్తం నుంచి ద‌క్కిన‌వి అని భావించాలి. ఇప్పుడు మీరు ఓడిపోండి అని ఎందుకని శా సిస్తారు..వారికి మీ నియ‌మిత నిర్బంధాలే వ‌రాలు.. వాటిని వారు క‌ళ్ల‌కు అద్దు కుని ప్ర‌యాణిస్తున్నారు చూడండి అప్పుడు మాత్ర‌మే మీకు ఆనందాలు.

భోజ‌నం వేళ‌లు త‌ప్పి ఉంటాయి
ఆక‌లి మాత్రం వేళ‌లు పాటించే ఉంటుంది
నియ‌మాలు పాటించే ఉంటుంది దేహం
నేను చ‌నిపోయాక లేదా నీవు మ‌ళ్లీ పుట్టాక
ఈ దేశం మారిపోతుంది

పాల‌కుల‌కు శ‌క్తి హీన‌త పోయి సంస్కారం పాటించాల‌న్న సోయి ఒక‌టి గుండె ల్లో ఘంటిక‌ల్లా మోగుతాది.అప్పుడు మాత్ర‌మే నీవు గంజి నీరు తాగాలి.. అ ప్పుడు మాత్ర‌మే నీవు నీకు కావాల్సిన దేహ సుఖాల‌ను పొందాలి..అప్పుడు మాత్ర‌మే ఆ చూరు కింద బ‌తుకు తెప్ప‌రిల్లిపోవాలి.. అయినా కూడా నీవు చా వాలి.. లేదా నేను నీ ఏడుపు చూసి ఈ జ‌న్మ దుఃఖాల‌కు వినాశ‌నం లేద‌నో విరుగుడు లేద‌నో గుర్తించాలి.. అయినా కూడా నీవు ఇలాంటి చోటును వెతికి నీ ఆర‌డుగ‌ల నేల ఒక‌టి నిర్మితం అయి ఉంటుంద‌ని గుర్తించి అందులో దాక్కోవా లి.. ఈదులాడాలి..గుంజుకోవాలి.

లేదా ఈ పాల‌కులతో నీవు క‌య్యం ఆడి ఒక్క ‌సారి అయినా వీరి మ‌తు లు మార్చాలి.. అప్ప‌టికీ లేదంటావా నీవు నీలానే త‌నువు చాలిస్తే దుఃఖాతీత ఆనందాలు ఒక‌టి వారిని ప‌ల‌కరిస్తాయి.. అప్పుడు ప‌రిహారం ఎంత‌న్న‌ది బీమా కంపెనీలు తేలుస్తాయి.. అప్పుడు కూడా నీకు ద ‌క్కే స్వ‌ర్గ లోక సుఖాలు ఎంత‌న్న‌ది లెక్క తేల్చే మం చి నాయ‌కులు మా మ ధ్య ఉన్నారు.. వారు నీకు బువ్వ పెట్ట‌డం కుద‌ర‌ని ప‌ని.. వారు నిన్ను ప‌నికి కుద‌ర్చ‌డం కుద‌ర‌ని ప‌ని.. దేశాన్ని ప్రేమించాల‌న్న ఏక‌వాక్య శాస‌నం ఒక‌టి నీ గుండెపై లిఖించి పోయి స‌గ‌టు భార‌తీయుడు ఎలా ఉండాలో నీతి వాక్యం ఒక‌టి నీకో శాస‌నంలా మార్చిపోతారు. నీవు నీతి త‌ప్ప‌రాదు నీవు ఆధార్ కార్డు పొంద‌ రాదు.. నీవు మ‌తం మార‌రాదు.

నీవు ఏం అనుకుంటే అది చేయ‌రాదు. ఆఖ‌రి కి రాత్రి పొందే దేహ సుఖం కూడా వారి ఆజ్ఞ నుంచి అందుకు అనుగుణంగా పొం దిన విధం నుం చి న‌డుచుకోవాలి.. వారే నీ శృంగార సా మ‌ర్థ్యాల‌ను శ‌రీర సా మ‌ర్థ్యాల‌ను ఇంకా కొన్నింటిని నిర్దేశించిపోతారు.. అప్ప‌టి దాకా నీవు నడువు.. వారు పెంచ‌మంటే దేశ జ‌నాభాను పెంచు లేకుంటే నీకు తెల్సుగా నిన్ను నీవు దేహ సుఖం పొంద‌క నియంత్రించుకో ! అందాక నీకు మే డే శుభాకాంక్ష‌లు చెబుతూనే ఉంటాం మేం ఇప్పుడ‌యినా నీకు స్వ‌ర్గం విలువ తెలిసి రావాలి..లేదా రాత్రి పొంద‌ని దేహ సు ఖం విలువ తెలిసి రావాలి.

ఇంటి ప‌ట్టున ఊరి ప‌ట్టున నీవు ఉండ‌ని రోజున ఊసురోమంటూ గ‌డ‌ప దాటిన రోజున ఈ ప్ర‌భుత్వాలకు..నీ త‌ర‌ఫున ప్ర‌క‌టించిన ఉద్దీప‌న ప‌థ‌కాల విలువేంటో తెలిసి ఉండాలి..అయినా నీవు ఎలా ఉండాలి అ న్న‌ది ఒక‌రి నిర్ణ‌యంగా మారేక ఇప్పుడు నీకు ఆ దేవుడే దిక్కు.. నీవు కాళ్ల‌కు సంకెళ్ల‌తో న‌డిచాక మా ద‌రిద్ర ‌గొట్టు జీవితాలు ఇంకాస్త ఆనందిస్తాయే కానీ మా రుతాయా.. మా జీవిత కాల ఆనందాలు మా జీవిత కాల దేహ సుఖాలు అ న్న‌వి ఎక్క‌డికీ పోవు.. నిర్బంధా లు అన్న‌వి కొంద‌రికి దేహ వాంఛ‌ల‌ను, స్వ‌ర్గ లోక సుఖాల‌నూ ప్రాప్తి చేస్తుంటే నీకు మాత్రం చావును ప‌రిచయం చేస్తున్నా యి.. అయినా నీవు చచ్చి ఏ లోకా ని కి పోతావు.. నీవు బ‌తికి ఏ తీరానికి చే రిపోతావు.. నీవు ఈ దేశానికి ఏమీ కావు..సంప‌న్న వ‌ర్గంకు నీ నీడ‌లు అవ‌స‌ రం/ నీపై న‌డిచి న సంద‌ర్భం ఒక‌టి వారికి చాలా అవ‌సరం..వారి మురికి నీరే ఇ క్క‌డ చెల్లుబాటు.. వాడి రాక్ష‌స న ‌వ్వే ఇక్క‌డి వారికి గొప్ప హాయి..అయినా కూడా నీవు ఈ దేశాన్నీ/నీ దేహాన్నీ ప్రేమిస్తూనే ఉండు. ఏం త‌ప్పులేదు..అది ఒక ప‌ద్ధ‌తి పాటించాలి..

– ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి

ఆర్ట్ : శేష బ్ర‌హ్మం

Read more RELATED
Recommended to you

Exit mobile version