తెలుగు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల బదిలీ ?

-

తెలుగు రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి లను బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దేశం మొత్తం మీద 5,6 హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిలకు స్థానచలనం తప్పదని విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న మహేశ్వరి అలాగే తెలంగాణ చీఫ్ జస్టిస్ గా ఉన్న చౌహాన్ కూడా బదిలీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఐదు ఆరు ప్రధాన హైకోర్టులకు గాను సీనియర్ జడ్జీలను ప్రధాన న్యాయమూర్తిగా నియమించే అవకాశం ఉందని అంటున్నారు.

ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలు కూడా ఇద్దరు సీనియర్ జడ్జీలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రధాన న్యాయమూర్తి తర్వాత స్థానంలో ఉండి అవసరాన్ని బట్టి తాత్కాలిక చీఫ్ జస్టిస్ గా బాధ్యతలు నిర్వహించే స్థాయి అలాగే త్వరలో సుప్రీం కోర్టు జడ్జి లు అయ్యే అర్హత ఉన్న జడ్జి లను తెలుగు రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు గా పంపించనున్నట్లు సమాచారం. ఇక గత ఏడాది జూన్ 23వ తేదీన తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా బాధ్యతలు స్వీకరించారు. అలాగే ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జేకే మహేశ్వరి కూడా గత ఏడాది అక్టోబరు ఏడో తేదీన బాధ్యతలు స్వీకరించారు. అయితే ఏపీ విషయానికి వస్తే విద్యుత్ కొనుగోలు ఒప్పందం రద్దు మొదలు ఎస్ ఈ సీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసు దాకా ఏపీ హైకోర్టు వర్సెస్ ఏపీ ప్రభుత్వం అన్నట్టు నడిచింది.

Read more RELATED
Recommended to you

Latest news