నేటి నుండి ఏపీ అసెంబ్లీ.. కీలక ఆర్డినెన్సుల ఆమోదం

-

ఈ రోజు నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం తొమ్మిది గంటలకు అసెంబ్లీ అంటే శాసనసభ ప్రారంభం కానుండగా పది గంటలకు శాసన మండలి భేటీ ప్రారంభం కానుంది.  తొలి రోజునే ఉభయ సభల ఆమోదానికి వివిధ శాఖలకు చెందిన కీలక ఆర్డినెన్సులు ఆమోదానికి రానున్నాయి. ముందుగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సహా పలువురు మాజీ ప్రజాప్రతినిధుల మృతికి ఉభయ సభలు సంతాపం తెలపనున్నాయి.

అలానే అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని బీఏసీ సమావేశంలో పని దినాలను ఖరారు చేయనున్నాయి. ప్రశ్నోత్తరాలు లేకుండానే ఉభయ సభలను నడపాలని ప్రభుత్వం భావిస్తోస్తోంది. అయితే ప్రతిపక్షం ప్రశ్నోత్తరాలు ఉండి తీరాల్సిందేనంటోంది. రేపు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభకు రానున్నారు. ఇక కోవిడ్ ప్రొటోకాల్ ప్రకారం మీడియా పాయింట్ ఏర్పాటుకు అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version