BIG BREAKING : సుజనా చౌదరికి గట్టి షాకిచ్చిన బీజేపీ..!

-

మూడు రాజధానుల అంశంపై బీజేపీ ఎంపీ సుజనా చౌదిరికి సొంత పార్టీయే షాక్ ఇచ్చింది. గత కొంతకాలంగా.. మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చిన నాటి నుంచి సుజనా చౌదరి.. దానిపై స్పందిస్తూనే ఉన్నారు. ఏపీ ప్రభుత్వం రాజధాని వికేంద్రీకరణ బిల్లును గవర్నర్‌కు పంపించడం రాజ్యాంగ విరుద్ధమని.. ఆర్టికల్‌ 254 ప్రకారం గవర్నర్‌ ఆ బిల్లును కేంద్రానికి నివేదించాలే తప్ప ఆమోదించే ఆస్కారం లేదన్నారు. రాజ్యాంగంలో రాష్ట్ర రాజధాని అంశంపై కేంద్రానిదే తుది నిర్ణయం అన్నారు. అమరావతిని రాజధానిగా సర్వే ఆఫ్‌ ఇండియా కూడా గుర్తించిందని గుర్తు చేశారు.

రాజ్యసభ్య ఎంపీగా చెబుతున్నా కేంద్రం సరైన సమయంలో జోక్యం చేసుకొని సరైన నిర్ణయం తీసుకుంటుంది అన్నారు. అయితే సుజనా చౌదరి చేసిన ఈ వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ ఆసక్తికర ట్వీట్ చేసింది. ‘రాజధాని విషయం కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంది అన్న బీజేపీ ఎంపీ సుజనా చౌదరి వ్యాఖ్య పార్టీ విధానానికి విరుద్ధం. రాజధాని అమరావతిలోనే కొనసాగాలి కానీ ఈ విషయం కేంద్ర ప్రభుత్వ పరిధిలో లేదన్నదే బీజేపీ విధానంగా అధ్యక్షులు సోము వీర్రాజు స్పష్టం చేశారు’అంటూ ట్వీట్ చేశారు. కాగా, దీనిపై నెటిజన్లు అనేక రకాలుగా స్పందిస్తున్నారు.. బీజేపీలో సుజనా కి విలువలేదని కొందరు.. పొమ్మనలేక పొగపెడుతున్నారని మరికొందరు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version