ఏపీ బీజేపీలో కల్లోలం చెలరేగిన విషయం తెలిసిందే. కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి రాజీనామా చేయడంతో రాజకీయం మరో మలుపు తిరిగింది. ఇంతకాలం అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల్లోనే ఆధిపత్య పోరు నడిచింది..కానీ బిజేపిలో కూడా అంతర్గతంగా ఆధిపత్య పోరు నడుస్తోంది. ఎప్పుడైతే కన్నాని తప్పించి సోము వీర్రాజుని అధ్యక్షుడుగా చేశారో అప్పటినుంచి రచ్చ నడుస్తోంది. కానీ పెద్దగా బయటపడలేదు.
అప్పటినుంచే కన్నా, సోముల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. సోము అధ్యక్షుడు అయ్యాక..కన్నా వర్గాన్ని సైడ్ చేస్తూ వచ్చారు. అలాగే సోము, జివిఎల్ నరసింహారావు లాంటి వారు వైసీపీకి అనుకూలంగా ఉంటున్నారనే విషయం పెద్ద చర్చగా మారింది. ఇదే క్రమంలో బీజేపీలో వైసీపీకి యాంటీగా ఉన్నవారిని సైడ్ చేస్తూ వస్తున్నారనే విమర్శలు వచ్చాయి. ఇప్పటికే కన్నా సన్నిహితులకు సోము చెక్ పెట్టారు. అలాగే ఓవీ రమణ లాంటి వారిని సస్పెండ్ చేశారు. ఇటు రావెల కిషోర్ బాబు లాంటి వారిని బయటకెళ్లెలా చేశారు. ఇప్పుడు ఏకంగా కన్నానే పార్టీ నుంచి బయటకెళ్లిపోయారు.
అయితే ఇప్పుడు పురందేశ్వరి వంతు వచ్చిందని ప్రచారం మొదలైంది. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఏదొక జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలని బిజేపి ఎంపీ జివిఎల్ డిమాండ్ చేస్తూ..అన్నిటికీ ఆ ఇద్దరి పేర్లేనా అంటూ ఎన్టీఆర్, వైఎస్సార్‌ల గురించి కామెంట్ చేశారు. దీనికి పురందేశ్వరి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆ ఇద్దరు కాదు..ఆ మహానుభావులు అంటూ..వారు చేసిన సంక్షేమ పథకాలని వివరించారు.
ఇలా జివిఎల్‌కు కౌంటర్ ఇచ్చిన పురందేశ్వరి సైతం బిజేపికి గుడ్ బై చెబుతారని తెలుస్తోంది. ఈమె కాదు..ఇంకా కొందరు నేతలు బిజేపిని వీడనున్నారని తెలుస్తోంది. ఆదినారాయణ రెడ్డి, వరదాపురం సూరి, విష్ణుకుమార్ రాజు లాంటి వారు బిజేపికి దూరమవుతారనే ప్రచారం ఉంది. చూడాలి మరి బిజేపిని ఇంకెంత మంది గుడ్ బై చెబుతారో.