ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ విస్తరణ పై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఏపీ కెబినెట్ భేటీలో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణపై సీఎం జగన్ ప్రస్తావించారు. చాలా మంది అస్పిరెంట్స్ కేబినెట్ బర్త్ కోసం ఆరాట పడుతున్నారని సీఎం జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. మంత్రి వర్గంలో స్థానం లేనంత మాత్రాన డిమోషనుగా భావించొద్దని సీఎం జగన్ స్పష్టం చేశారు.
మళ్లీ గెలిచి వస్తే మంత్రులుగా ఉండేది మీరే కదా అని సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలో జరిగే వైఎస్సార్ సీఎల్పీ భేటీలో మంత్రివర్గ పునర్ వ్యవస్ధీకరణపై మరింత స్పష్టత వస్తుందని జగన్ పేర్కొన్నట్లు సమాచారం అందుతోంది. మంత్రి వర్గం నుండి తప్పించిన వారు పార్టీ అభివృద్దికి పని చెయ్యాలని చెప్పారు సీఎం జగన్. పదవి నుంచి తప్పించిన వారికి జిల్లా ఇంచార్జ్ బాధ్యతలు ఇస్తామని కూడా ప్రకటన చేశారు. ఇప్పుడు ఉన్నవారిలో కొంత మంది మాత్రమే మంత్రివర్గంలో ఉంటారని సీఎం జగన్ స్పష్టం చేశారు.