రాజ్ భవన్‌లో 100 కొత్త పోస్టులు : మంత్రి చెల్లుబోయిన వేణు

-

నేడు ఏపీ కేబినెట్‌ సమావేశం సీఎం జగన్ అధ్యక్షతన జరిగింది. అయితే ఈ కేబినెట్‌ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశం అనంతరం మంత్రి చెల్లుబోయిన వేణు మీడియాతో మాట్లాడుతూ.. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపిందన్నారు. అంతేకాకుండా.. అమ్మఒడికి కేబినెట్ ఆమోదం తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు.

క్రీడాకారిణి జ్యోతి సురేఖకు డిప్యూటీ కలెక్టర్ పోస్టుకు ఆమోదం, ఆక్వా రైతులకు సబ్సిడీని మరింత మందికి వర్తింప చేసేలా చర్యలు.. పదెకరాల వరకు ఆక్వాసాగు చేసుకునే రైతులకు విద్యుత్ సబ్సిడీ.. ప్రస్తుతమున్న జెడ్పీ ఛైర్మన్లనే వారి కాలపరిమితి ముగిసే దాకా కొనసాగించాలని నిర్ణయం. కొత్త జిల్లాలు ఏర్పడినా.. ఉమ్మడి జిల్లాల జడ్పీ ఛైర్మన్లే కొనసాగుతారు. డిసిప్లీనరీ ప్రొసిడీంగ్స్ ట్రిబ్యునలును రద్దు చేశాం. రాజ్ భవనులో 100 కొత్త పోస్టులు. గండికోటలో టూరిజం శాఖకు 1600 ఎకరాల భూమి కేటాయింపుకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version