ఇవాళ ఏపీ కేబినేట్‌ మీటింగ్‌…అమరావతికి రూ.20 వేల కోట్లు !

-

ఇవాళ ఏపీ కేబినేట్‌ మీటింగ్‌ జరుగనుంది. ఇవాళ ఉద‌యం 11 గంట‌ల‌కు ఏపీ కేబినేట్‌ భేటీ నిర్వహించనున్నారు. అమ‌రావ‌తిలో 20 వేల కోట్ల విలువైన ప‌నులకు పాల‌న‌ప‌ర‌మైన అనుమ‌తుల‌పై ఏపీ కేబినేట్‌ లో చర్చ‌ జరుగనుంది. ఇప్ప‌టికే సిఆర్డియో అధారిటీ అమోదించిన ప‌లు ప్రాజెక్ట్ ల అమోదం కోసం ఏపీ కేబినేట్‌ ముందుకు ప్ర‌తిపాద‌న‌లు వచ్చాయి.

AP Cabinet meeting will be held at 11 am today

విజ‌య‌వాడ బుడ‌మేరు ముంపు బాధితుల‌కు రుణాల రీ షేడ్యుల్ కోసం స్టాంపు డ్యూటీ మిన‌హాయింపు ఇచ్చారు. ప‌లు ప‌రిశ్ర‌మ‌ల‌కు భూ కేటాయింపులు చేయనున్నారు. పీడీఎస్ రైస్ విదేశాలకు తరలిపోకుండా తీసుకోవాల్సిన చర్యలపై కేబినెట్ లో చర్చ జరగనుంది. సోషల్ మీడియా దాడులపై పెట్టిన కేసులు, వాటి పురోగతిపై చర్చించనుంది ఏపీ కేబినేట్‌. అటు ఏపీలో పెట్టుబడుల అంశంపై ఏపీ కేబినేట్‌ లో చర్చ జరుగనుంది. అలాగే పెన్షన్ల కోతపై కూడా చర్చ జరుగనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news