రాజధాని ఎఫెక్ట్: ఉత్తరాంధ్రలో వైసీపీ గ్రాఫ్ తగ్గదా!

-

ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది..అయినా సరే ఇప్పటికీ వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులపైనే ఉంది. ఎలాగైనా మూడు రాజధానులని అమలు చేసి తీరుతామని అంటుంది. ఓ వైపు ఏమో అమరావతి కోసం ఆ ప్రాంత ప్రజలు రైతులు ఉద్యమం చేస్తున్నారు…ఇప్పుడు తాజాగా అమరావతి టూ అరసవెల్లి వరకు పాదయాత్ర చేస్తున్నారు. ఉత్తరాంధ్ర మీదుగా పాదయాత్ర జరగనుంది.

ఉత్తరాంధ్రలో గాని అమరావతి రైతులకు మద్ధతు వస్తే…వైసీపీకి ఇబ్బంది అవుతుంది. అందుకే పాదయాత్ర ఖచ్చితంగా అడ్డుకుని తీరుతామని ఉత్తరాంధ్ర వైసీపీ మంత్రులు అంటున్నారు. అలాగే ఈ అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లు పెట్టి..ఎలాంటి న్యాయ సమస్యలు లేకుండా మూడు రాజధానులు ఏర్పాటు చేయడానికి వైసీపీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇలా చేయడం వల్ల మూడు ప్రాంతాలకు న్యాయం జరుగుతుందని, ముఖ్యగా ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు న్యాయం జరుగుతుందనే కోణంలో వైసీపీ ఉంది.

అలాగే ఆ రెండు చోట్ల రాజకీయంగా కలిసొస్తుందని జగన్ భావిస్తున్నారు. ఎలాగో రాయలసీమలో వైసీపీకి బలం ఎక్కువే. కానీ ఉత్తరాంధ్రలో టీడీపీకి బలం ఉంది. గత ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో వైసీపీ సత్తా చాటింది. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు కలిపి మొత్తం 34 స్థానాలు ఉంటే వైసీపీ 28 స్థానాలు గెలుచుకుంది..కేవలం టీడీపీ 6 స్థానాలు గెలుచుకుంది. అయితే ఇప్పుడు మూడు రాజధానులతో మళ్ళీ ఉత్తరాంధ్రలో మెజారిటీ సీట్లు గెలుచుకోవచ్చు అని, అక్కడ తమ గ్రాఫ్ తగ్గలేదని వైసీపీ భావిస్తుంది.

ఈ సారి కూడా 25 సీట్లపైనే గెలుచుకోవాలని వైసీపీ చూస్తుంది. మరి మూడు రాజధానుల ప్రభావం ఉత్తరాంధ్రపై ఉంటుందా? లేక ఇప్పటివరకు ఆలస్యం చేసి, ఎన్నికల ముందు రాజధాని పెట్టడం వల్ల ఉత్తరాంధ్ర ప్రజలు వైసీపీని నమ్ముతారా? అంటే చెప్పలేని పరిస్తితి ఉంది. రాజకీయంగా ఏదైనా జరగొచ్చు. కానీ విశాఖలో రాజధాని ఏర్పాటు చేసినా చేయకపోయినా మాత్రం ఉత్తరాంధ్రలో వైసీపీ గ్రాఫ్ పడిపోయేలా ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఈ సారి వైసీపీకి టీడీపీ గట్టి పోటీ ఇస్తుందని చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version