టాలీవుడ్ సినీ నటుడు పోసాని కృష్ణ మురళీ పై ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు తాజాగా కేసు నమోదు చేశారు. టీడీపీ నేత, రాష్ట్ర తెలుగు యువత ప్రతినిధి బండారు వంశీకృష్ణ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. గత ఏడాది సెప్టెంబర్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో పోసాని కృష్ణ మురళీ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అసత్య ప్రచారం చేసారని తన ఫిర్యాదులో వంశీ కృష్ణ పేర్కొన్నారు.
పోసాని కృష్ణ మురళీ చేసిన వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడు ని కించ పరిచేలా వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా ఉన్నాయని చెప్పారు. సామాజిక వర్గాల మధ్య విభేదాలు తలెత్తేలా మాట్లాడిన పోసాని పై చర్యలు తీసుకోవాలని కోరారు. వంశీ కృష్ణ ఫిర్యాదు తో సీఐడీ అధికారులు సెక్షన్ 111, 196, 299, 336 (3), 336 (4), 341, 61(2) వంటి బీఎన్ఎస్ సెక్షన్ల కింద పోసాని కృష్ణ మురళి పై కేసు నమోదు చేసారు.