ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన సీఎంఆర్ఎఫ్ నకిలీ చెక్కుల కేసు విచారణ ప్రారంభించారు ఏపీ సీఐడీ అధికారులు. రంగం లోకి దిగిన మూడు ప్రత్యేక బృందాలు ఈ కేసుని విచారిస్తున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ప్రత్యేక దృష్టి పెట్టిన అధికారులు… నిందితులను బయటకు లాగడానికి కష్టపడుతున్నారు. సీఐడీ డీజీ హరికృష్ణ ప్రత్యేక అధికారిగా నియమించింది సీఐడి.
రేపు మంగళూరు, కలకత్తా, ఢిల్లీ వెళ్లనున్నాయి ప్రత్యేక బృందాలు. పలు బ్యాంక్ బ్రాంచ్ లలో చెక్ లు దాఖలు చేసినట్టుగా అధికారులు గుర్తించారు. దీనిపై రెవెన్యూ శాఖ అధికారులు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై సిఎం జగన్ అధికారులతో సమావేశం నిర్వహించారు. వివరాలు కూడా అడిగి తెలుసుకుని ఆదేశాలు జారీ చేసారు. త్వరలోనే కేసు ఒక కొలిక్కి రానుంది.