ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు, రేపు అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం కానున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తవ్వగా మరికొద్ది సేపట్లో ఈ సమావేశం ఉ.10:30 గంటలకు ప్రారంభం కానుంది. కలెక్టర్ల సమావేశంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, విజన్ 2047 కొత్త పాలసీలపై ముఖ్యమంత్రి వారికి దిశానిర్దేశం చేస్తారని సమాచారం. మొత్తం 26 జిల్లాల కలెక్టర్లు, అధికారులతో పాటుగా మంత్రులు, ఐపీఎస్‌లు బుధవారం, గురువారం జరిగే సమావేశంలో పాల్గొననున్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు లబ్దిదారులకు చేరుతున్నాయా? లేదా ఏమైనా పక్కదారి పడుతున్నాయా? అనే అంశంపై కూడా చంద్రబాబు కలెక్టర్లను వివరాలు అడిగి తెలుసుకుంటారని సమాచారం. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది.