ఏపీ సీఎం చంద్రబాబు బర్త్ డే.. మాజీ సీఎం కేసీఆర్ స్పెషల్ విషెస్

-

తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘నిరంతరం ప్రజాసేవకు అంకితమైన వారి జీవితం, ఆయురారోగ్యాలతో, నిండు నూరేళ్ళు సుఖశాంతులతో వర్ధిల్లాలని’ కేసీఆర్ ఆకాంక్షించారు.

ప్రజలకు మరింత సుభిక్షంగా పాలన అందించేందుకు దేవుడు వారికి మరింత శక్తినివ్వాలని కోరుకున్నారు. కాగా, చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు పలువురు సెలబ్రిటీలు, పొలిటికల్ లీడర్స్ ప్రత్యేకంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. కాగా, గతంలో టీడీపీలో పనిచేసిన కేసీఆర్.. పార్టీ నుంచి బయటకు వచ్చి సొంతంగా బీఆర్ఎస్ పార్టీని స్థాపించి 2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక రెండు పర్యాయాలు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news