వరద ప్రభావిత ప్రాంతాల్లో మూడు రోజులుగా కేంద్రబృందం పర్యటిస్తుంది. ముఖ్యంగా రాయలసీమలోని జిల్లాల్లో బృందం పర్యటించింది. తాజాగా ఈరోజు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో కేంద్ర బృందం సమావేశమైంది. భారీ వర్షాలు, వరదల సమయంలో ఏపీ తీసుకున్న చర్యలను కేంద్ర బృందం ప్రశంసించింది. వరదల వల్ల కడప జిల్లాకు ఎక్కువగా నష్టం వాటిల్లినట్లు తెలిపారు. అన్నమయ్య ప్రాజుక్ట్ తెగిన చోట అపార నష్టం వాటిల్లిందని అన్నారు. వరద నష్టంలో 40 శాతం రోడ్లు భవనాలు ధ్వసమయ్యాయని.. 32 శాతం నష్టం సాగు దాని అనుబంధ రంగాల్లో జరిగిందని, ఇగిగేషన్ స్కీంలలో 16శాతం మేర నష్టం జరిగిందని కేంద్రం బృందం సీఎంకు వివరించారు. వీలైనంత మేర ఆదుకోవడానికి మా వంతు సహకారాన్ని అందిస్తాం అని కేంద్ర బృందం సీఎంకు తెలిపింది.
3 రోజులపాటు వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర బృందం.. వీలైనన్ని గ్రామాలను, వరద కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలనూ పరిశీలించామని, కడప జిల్లాకు భారీ నష్టం వాటిల్లిందని తెలిపారు. ఆ గ్రామాలను కూడా పరిశీలించామని, పశువులు చనిపోవడం, రోడ్లు, భవనాలు, ప్రాజెక్టులు.. ల్లాంటి మౌలిక సదుపాయాలు బాగా దెబ్బతిన్నాయన్నారు.