ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరోసారి యువతను టార్గెట్ చేసారా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. ఆయన అధికారంలోకి రావడానికి ఎక్కువగా యువతనే ముందు నుంచి టార్గెట్ చేస్తూ వచ్చారు. ఆయనకు ముందు నుంచి అండగా నిలిచింది కూడా యువతే. వైఎస్ చనిపోయిన సమయంలో కూడా ఆయన సిఎం అవ్వాలి అని కోరుకుంది కూడా ఎక్కువగా యువతే. అదే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కి బాగా మైనస్ అయింది అని చెప్తూ ఉంటారు. రాజకీయంగా జగన్ బలం పెంచుకోవడానికి కూడా ఇదే కారణం అని అంటారు.
ప్రస్తుతం జగన్ అధికార౦లో ఉన్నారు. ఇప్పుడు కూడా ఆయన యువతనే టార్గెట్ చేస్తున్నారు అనేది అర్ధమవుతుంది. యువతను ఎక్కువగా టార్గెట్ చేస్తూ సంక్షేమ కార్యక్రమాలు మొదలు పెడుతున్నారు. అమ్మ ఒడి, విద్యా వసతి, విద్యా దీవెన వంటి కార్యక్రమాలను జగన్ మొదలుపెట్టారు. ఈ కార్యక్రమాలు అన్నీ కూడా యువతకు బాగా దగ్గర అయినవే. వీటి ద్వారా ఎక్కువగా లబ్ది పొందేది యువత. వాళ్ళు అందరూ వచ్చే ఎన్నికల్లో జగన్ కి బలమైన ఓటు బ్యాంకు అయ్యే అవకాశాలు ఉన్నాయి అనేది స్పష్టంగా అర్ధమవుతుంది.
ముఖ్యంగా కాలేజి విద్యార్ధులు అప్పటికి విద్యను పూర్తి చేసుకుంటారు. వాళ్ళు అందరూ కూడా ఎన్నికల్లో తనకు ప్రచారం చేసే అవకాశం కూడా ఉంటుంది. అందుకే జగన్ ఇప్పుడు ఎక్కువగా యువత మీద దృష్టి పెట్టారు అనేది వాస్తవం. ఆయన మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను యువతను టార్గెట్ చేసి ప్రవేశ పెట్టే అవకాశాలే ఉన్న్నాయి. ఇక వాలంటీర్ ఉద్యోగాలు కూడా యువతను టార్గెట్ చేసే ఇచ్చినవే. అందుకే ఇప్పుడు విపక్ష తెలుగుదేశం పార్టీ ఇబ్బంది పడుతుంది. జగన్ తో తమ యువత ఓటు బ్యాంకు దూరం అవుతుంది అనే భావన చంద్రబాబులో ఉంది.