ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి… ప్రధాని నరేంద్ర మోడీ తో సమావేశమయ్యారు. ఇవాళ మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఢిల్లీ బయలుదేరిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కాసేపటి క్రితమే ప్రధాని కార్యాలయంలో ఆయనను కలిశారు. ఈ సందర్భంగా ఆయనతో సీఎం జగన్ సమావేశం అయ్యారు.
ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ అంశాల పరిష్కారం పై ప్రధాని నరేంద్ర మోడీతో చర్చిస్తున్నారు సీఎం జగన్. ప్రత్యేక హోదా, ఆర్థిక లోటు భర్తీ, రాష్ట్ర విభజన హామీలు, పోలవరం అంచనా వ్యయానికి ఆమోదం, కడప స్టీల్ ప్లాంట్, దుగ్గరాజుపట్నం ఓడరేవు లాంటి అంశాలను ప్రధాని మోడీ వద్ద ప్రస్తావించనున్నారు సీఎం జగన్. ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అనంతరం… కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్, ఏవియేషన్ మంత్రుల తో పాటు ఇతర మంత్రులను సీఎం జగన్ భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక రేపు మళ్ళీ ఏపీకి రానున్నారు జగన్ మోహన్ రెడ్డి.