ఏపీ సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు సంచలనం కలిగిస్తున్నాయి. చేతికి ఎముకే లేనట్టుగా వరాల వర్షం కురిపిస్తున్నాడు. ఇప్పటికే జగన్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయి. వాటిని అమలు చేసేందుకే బడ్జెట్ ఎంత మేర సహకరిస్తుందో అన్న అనుమాలు ఉన్నాయి.
ఆ ఎన్నికల హామీలు అమలు చేస్తే చాలు అనుకుంటున్న ప్రజలకు సీఎం జగన్ షాక్ ఇస్తున్నారు.. ఇప్పుడు అడగని వర్గాలపైనా జగన్ ప్రేమ కురిపించేస్తున్నారు. చేనేత కుటుంబాలకు ఏడాదికి 24 వేల రూపాయలు అందిస్తామని తాజాగా నిర్ణయం తీసుకున్నారు. మత్స్యకారుల కుటుంబాలకూ వరాలు కురిపించారు. వేట సమయంలో రూ.10 వేలు ఇస్తామని ప్రకటించారు.
అంత వరకూ బాగానే ఉంది. ఇప్పుడు .. జగన్ న్యాయవాదులను కూడా వదలడం లేదు.
డిసెంబర్ 11న జాతీయ న్యాయవాదుల దినోత్సవం సందర్భంగా న్యాయవాదులకు ప్రోత్సాహకం రూ.5 వేలు ఇవ్వాలని కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. లా చదువుకొని బార్ అసోసియేషన్‌లో ఉన్న ప్రతి న్యాయవాదికి మూడేళ్ల పాటు ఈ ప్రోత్సాహకాన్ని అందిస్తారట.
మరి ఇన్ని పథకాలకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుందన్నది మాత్రం అంతుబట్టకుండా ఉంది. చూడాలి జగన్ ఏ మేజిక్ చేస్తారో.. ఇవన్నీ సక్రమంగా అమలైతే మాత్రం జగన్ ఖ్యాతి అమాంతం పెరిగిపోవడం ఖాయం. చూడాలి ఈ హామీలు అన్నీ జగన్ ఎలా నిలబెట్టుకుంటారో.