నేడు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రానున్నారు. ఆరోగ్యశ్రీని ఆమోదిస్తున్న ఆస్పత్రుల్లో… బాధితుల వైద్యం ఖర్చులు రూ.1000 దాటితే… ఆ ఆపరేషన్లన్నింటినీ… ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చి… ఫ్రీగా వైద్యం అందించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. ముందుగా పశ్చిమగోదావరి జిల్లాలో ఇది పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభం కాబోతోంది. అక్కడ అది ఎలా అమలవుతుందన్నదాన్నిబట్టీ… రాష్ట్రమంతా అమలు చేయనున్నారు. ఈ సందర్భంగా ఆరోగ్యశ్రీ పరిధిలోకి 2,059 చికిత్సలు రాబోతున్నాయి.
ఈ పైలెట్ ప్రాజెక్టు ద్వారా జిల్లావ్యాప్తంగా 12,45,511 మందికి ప్రయోజనం చేకూరనుంది. ఈ స్కీం కోసం ఆరోగ్యశ్రీ లబ్ధిదారుల జాబితాను గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉంచుతున్నారు. ఎవరైనా లబ్ధిదారులు మిగిలిపోతే… వారు ఎవరిని సంప్రదించాలి.. ఎవరికి దరఖాస్తు చేయాలన్న అంశాల్ని కూడా అక్కడే తెలపనున్నారు. ముఖ్యమంత్రి రాక కోసం ఏలూరులో ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి.