తమిళనాడులో అటు రాజకీయాల్లో ఉన్నవారికి ఇటు సినిమాల్లో ఉన్నవారికి ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా ఉంటుంది. ఆ ఫ్యాన్స్ కి ఓ అలవాటు ఉంది.. తమ పుట్టిన రోజులకు తమ హీరోల పుట్టినరోజులకు ఆఖరికి తమ ఇళ్ళలో జరిగే పెళ్లిలకైనా వారు తమ అభిమాన నటుడి అభిమాన నేత ఫోటోలను ఆయా బ్యానర్లపై పెడతారు. తమిళనాడులో ఏ వీధిలో చూసిన కనిపించే బ్యానర్లపై అక్కడి సూపర్ స్టార్ రజినీకాంత్, అజిత్, విజయ్ ల వంటి స్టార్ హీరోల ఫోటోలు కనపడతాయి. కానీ ఇక్కడ విడ్డూరం ఏంటంటే తాజాగా తమిళానాడులో ఓ బ్యానర్ పై ఏపీ సీఎం వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఫోటో కనిపించడం.
వివరాల్లోకి వెళితే.. సూపర్ స్టార్ విజయ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఏర్పాటు చేసిన బ్యానర్లలో విజయ్ ఫోటోతో పాటు ఏపీ సీఎం వైఎస్ జగన్ చిత్రాలు ముద్రింపబడ్డాయి. తమ హీరో విజయ్ ని రాజకీయాల్లోకి ఆహ్వానిస్తున్న ఫ్యాన్స్, ఆయన తండ్రి చంద్రశేఖర్ పైనా ఒత్తిడి పెంచుతున్నారు. వచ్చే ఏడాదిలో జరిగే ఎన్నికల్లో తమ అభిమాన నటుడు రాజకీయాల్లోకి రావాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ లా ఎదగాలని వారు కోరుకుంటున్నారు. ఇక ఆ బ్యానర్లలో విజయే రేపటి సర్కారును నిర్ణయించే సర్కార్ అంటూ క్యాప్షన్ ముద్రింపబడింది. ఇప్పుడు ఆ బ్యానర్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.