ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 8,943 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి అని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. గడిచిన 24 గంటల వ్యవధిలో ఏపీలో 53,026 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 8,943 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని హెల్త్ బులిటెన్ లో ప్రభుత్వం వెల్లడించింది.
ఒక్క రోజులో రాష్ట్రంలో 97 మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారని ప్రభుత్వం పేర్కొంది.
ఇక కరోనా వలన కర్నూలు జిల్లాలో 12 మంది, చిత్తూరు, తూర్పు గోదావరి, గుంటూరు, పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాల్లో 10 మంది చొప్పున అనంతపురం, కడప, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ఆరుగురు చొప్పున విజయనగరం జిల్లాలో ముగ్గురు చొప్పున కృష్ణా జిల్లాలో ఇద్దరు చొప్పున మృతి చెందారు.