ఏపీ లో కొనసాగుతున్న కరోనా కేసులు …!

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా తన హవాని కొనసాగిస్తోంది. తాజాగా గడచిన 24 గంటల్లో నమోదైన కేసుల వివరాలను ఆంధ్రప్రదేశ్ హెల్త్ బులిటెన్ మీడియా ద్వారా విడుదల చేయడం జరిగింది. ఇక ఈ బులిటెన్ పరంగా రాష్ట్రవ్యాప్తంగా నిన్న మొత్తం 27,643 శాంపిల్స్ ను పరీక్షించగా అందులో 1051 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారించారు. వీరితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 11 మంది కూడా తర్వాత నిర్ధారణ కావడంతో 1062 మొత్తం కేసులు నేడు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నేటి వరకు 22,259 కేసులు నమోదయ్యాయి. మరోవైపు నిన్న ఒక్కరోజే రాష్ట్రం మొత్తంగా 1,332 మంది అత్యధికంగా కరోనా వైరస్ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు.

carona ap

మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 12 మంది కరోనా బారినపడి మరణించారు. దీనితో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 264 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 10,894 పాజిటివ్ కేసులు యాక్టివ్ గా కొనసాగుతున్నాయి. నేటితో రాష్ట్రవ్యాప్తంగా 11,101 మంది సంపూర్ణ ఆరోగ్యంతో హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version