ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. వారం రోజుల నుంచి కేసుల సంఖ్య అంత్యంత వేగంగా నమోదు అవుతున్నాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 37 కోనా కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో 303 కి చేరుకున్నాయి కరోనా కేసులు. కర్నూలు జిల్లాల్లో అత్యధికంగా 74 కరోనా కేసులు నమోదు అయ్యాయి. నెల్లూరు లో 42 కేసులు, గుంటూరు జిల్లాలో 32 కేసులు నమోదు అయ్యాయి.
పశ్చిమ గోదావరి జిల్లాలో 21 కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతానికి కరోనా ఫ్రీ జిల్లాలు గా శ్రీకాకుళం విజయనగరం ఉన్నాయి. కరోనా కేసులు ప్రతీ జిల్లాలోను పెరుగుతున్నాయి. అసలు లేదు అనుకున్న జిల్లాల్లో ఈ విధంగా కేసులు నమోదు కావడంపై ఇప్పుడు ఆందోళన వ్యక్తమవుతుంది. ప్రభుత్వం చర్యలు చేపడుతున్నా సరే ప్రస్తుతం మాత్రం పరిస్థితి చేయి దాటింది అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ధీమాగా ఉన్న ప్రజలు కూడా ఇప్పుడు భయపడే పరిస్థితి ఏర్పడింది.