రాష్ట్రంలో సైబర్ క్రైం రూపంలో దోపిడీ ఎక్కువగా జరుగుతుంది : ఏపీ డీజీపీ

-

పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో నూతనంగా నిర్మించిన డాగ్ స్కావ్డ్.. జిల్లా పెరేడ్ గ్రౌండ్ ని ప్రారంభించారు డీజీపీ ద్వారకా తిరుమలరావు. ఈ సందర్భంగా ఆయన కొన్ని కీలక కామెంట్స్ చేసారు. రాష్ట్రంలో మాకు ప్రస్తుతం ఐదారు ప్రధాన అంశాలు టార్గెట్ గా ఉన్నాయి. ఇటీవల అమాయకులకు ఫోన్లు చేసి ఫెక్ పోలీసులు, కోర్టులు, లాయర్లు అని చూపించి డబ్బులు గుంజుతున్నారు. గంజాయి, స్మగ్లింగ్ ని పూర్తిగా అరికడతాం.

అలాగే రాష్ట్రంలో సైబర్ క్రైం రూపంలో దోపిడీ ఎక్కువగా జరుగుతుంది. టెక్నాలజీని వాడుకొని సాద్యం అయినంత ఎక్కువ వాటిని అరికట్టాలి. ఇక చిన్నారులు, వృద్ధులపై అఘాయిత్యాలు జరగటం తలదించుకొవాల్సిన విషయం. అయితే కొత్తగా సోలార్ ప్యానల్ సిసి కెమేరాలను ఏర్పాటు చేస్తున్నాం. శాంతి భద్రతల విషయంలో టెక్నాలజీని వాడుకుంటే సత్పలితాలు ఉంటాయి. డాగ్ స్కావ్డ్, సీసీ కెమెరాల వలన కొంత ఉపయోగం ఉంది. సైబర్ క్రైం రేటు తగ్గాలని టార్గెట్ పెట్టుకున్నాం అని ఏపీ డీజీపీ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news