శ్రీ తేజ ఆరోగ్యం పై హెల్త్ బులిటెన్ విడుదల చేసింది కిమ్స్ ఆస్పత్రి. పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో శ్రీ తేజ గాయపడగ.. ఆతని తల్లి మరణించిన విషయం తెలిసిందే. ఇక గాయపడిన శ్రీ తేజను అప్పుడే కిమ్స్ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ అతనికి ప్రభుత్వమే వైద్యం ఇప్పిస్తుంది. ఈ క్రమంలోనే శ్రీ తేజ ఆరోగ్యం ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది అని కిమ్స్ ఆసుపత్రి తెలిపింది.
అలాగే శ్రీ తేజ తనంతట తానుగా ఊపిరి పీల్చుకోగలుగుతున్నాడు. ఇప్పటికీ ఇంకా ఫిజియోథెరపీ కొనసాగుతుంది. ఇప్పుడిప్పుడే కోల్కుంటున్నప్పటికీ తన కుటుంబ సభ్యులను గుర్తించటం లేదు అని పేర్కొంది. కానీ శ్రీ తేజ శరీరం చికిత్స కు స్పందిస్తుంది అని పేర్కొన్నారు. ఇక ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సమయంలో శ్రీ తేజను రాష్ట్ర మంత్రులు అలాగే పుష్ప సినిమా హీరో అల్లు అర్జున్ కూడా వచ్చి చూసి.. శ్రీ తేజ తండ్రిని పరామర్శించిన విషయం తెలిసిందే.