డేట్ అనుకున్నారా: బాబులకు కొత్త టెన్షన్ పుట్టించిన పోలీస్ బాస్!

-

అమరావతి నుంచి పరిపాలనా రాజధాని తరలింపు కచ్చితంగా జరుగుతుందని అధికార వైకాపా నేతలు చెబుతున్న సమయంలో.. టీడీపీ నేతల హడావిడి మరింత పెరిగిన తరుణంలో… ఏపీ పోలీస్ బాస్ డీజీపీ గౌతమ్‌ సవాంగ్ చెపిన మాట, ఇచ్చిన స్టేట్ మెంట్ ఇప్పుడు టీడీపీ నేతల్లో కొత్త టెన్షన్ తీసుకొచ్చిందని చెబుతున్నారు విశ్లేషకులు. ఇంతకూ ఆయన చెప్పిన మాట ఏమిటి.. అందులో అర్ధమైన విషయం ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం.

78 వేల మంది పోలీసులు కరోనా నియంత్రణ విధులు నిర్వర్తిస్తున్నారని, 266 మంది పోలీసులు వైరs బారినపడ గా ఒకరు మృతి చెందారని.. కరోనా సమయంలో పోలీసుల పనితీరును అభినందించిన ఆయన… అనంతరం రాష్ట్ర రాజధానిని ఏ క్షణంలో విశాఖకు తరలించినా పోలీసు శాఖ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఒక పోలీస్ బాస్ నోటి నుంచి ఇలాంటి మాట వచ్చిందనే విషయం తెలియడంతో టీడీపీ నేతలు టెన్షన్ పడిపోతున్నారంట.

గత కొంతకాలంగా జగన్ ప్రత్యక్షంగా మీడియా ముందుకు రావడం లేదు.. సజ్జల రామకృష్ణారెడ్డి మొదలైన నేతలు మాత్రమే ప్రతిపక్షాల విమర్శలకు ప్రతివిమర్శలు చేసి వెళ్లిపోతున్నారు. ఈ దశలో అసలు సీఎం క్యాంప్ ఆఫీసులో ఏమి జరుగుతుంది అనే దానిపై టీడీపీ నేతలు ఎవరికీ సరైన క్లారిటీ కానీ.. కనీసం మీడియా లీకులు కాని రావడం లేదు! ఈ సమయంలో డీజీపీ అలా చెప్పడంతో.. కచ్చితంగా ఈ నెలాఖరు లేదా వచ్చే నెలలో రాజధాని తరలింపు ఉండొచ్చనే ఊహాగాణాలకు తెరలేచింది.

ఇప్పుడు ఈ ఆలోచనే బాబు & కో లను తెగ టెన్షన్ పెట్టేస్తుందంటున్నారు విశ్లేషకులు. ప్రస్తుతానికి అమరావతిలో ధర్నాలు, దీక్షలు చేస్తున్న రైతులతో త్వరలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ సమావేశమయ్యే సూచనలు ఉన్నాయని, అనంతరం వారికి కాస్త క్లారిటీ కం భరోసా ఇచ్చి వారిని శాంతింపచేసి అనంతరం వీలైనంత త్వరలో రాజధానిని విశాఖకు తరలించాలని జగన్ తలస్తున్నారని అంటున్నారు. ఈ క్రమంలో డీజీపీ చెప్పిన మాట బాబులకు కొత్త టెన్షన్ తెచ్చినట్లే అని పలువురు అభిప్రాయపడుతున్నారు!

Read more RELATED
Recommended to you

Exit mobile version