“భీమ్లా నాయక్” సినిమా అట్టర్ ఫ్లాఫ్ : మంత్రి ఆదిమూలపు సెటైర్లు !

-

“భీమ్లా నాయక్” సినిమా వివాదం పై ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సెటైర్లు పేల్చారు. చట్టానికి ఎవరూ చుట్టం కాదంటూ పవన్ కళ్యాణ్ కు చురకలు అంటించారు మంత్రి అధిములపు. చట్టాన్ని ఎవరు అతిక్రమించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. వినోదం అందరికీ అందుబాటులో ఉండాలనే ఆలోచనతో ప్రభుత్వం ఒక విధానం తీసుకుని వచ్చిందని పేర్కొన్నారు.

“భీమ్లా నాయక్” కోసం ప్రత్యేకంగా టార్గెట్ చేయాల్సిన అవసరం ఏముంటుంది ? అని చెప్పారు. పవన్ కళ్యాణ్ కంటే పెద్ద హీరోలు చాలా మంది ఉన్నారని వెల్లడించారు మంత్రి ఆదిమూలపు సురేష్. అసలు “భీమ్లా నాయక్” సినిమా హిట్ అవుతుందో…ఫట్ అవుతుందో ? అంటూ మంత్రి ఆదిమూలపు సురేష్ సెటైర్లు పేల్చారు. భీమ్లా నాయక్ సినిమా ఎక్కువ రోజులు ఆడుతుందన్న ధైర్యం వాళ్ళకే లేనట్లు ఉందని ఎద్దేవా చేశారు. తమకు అన్నీ సినిమాలు ఒకటేనని వెల్లడించారు మంత్రి ఆదిమూలపు సురేష్ సెటైర్లు పేల్చారు. ప్రభుత్వం అందరికీ సమాన్యాయం చేస్తుందని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version