పరిటాలకు ఫిక్స్..కేతిరెడ్డిని నిలువరిస్తారా?

-

మొత్తానికి పరిటాల శ్రీరామ్ అనుకున్నది సాధించారు…ధర్మవరం సీటు తనకే దక్కేలా చేసుకున్నారు…తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు…ధర్మవరం టీడీపీ అభ్యర్ధిగా పరిటాల శ్రీరామ్‌ని ఫిక్స్ చేశారు. అయితే గత ఎన్నికల్లో శ్రీరామ్..రాప్తాడు నుంచి పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో ధర్మవరంలో టీడీపీ నుంచి పోటీ చేసి గోనుగుంట్ల సూర్యనారాయణ(సూరి) సైతం ఓడిపోయారు. ఇక ఓడిపోయాక సూరి టీడీపీని వదిలి బీజేపీలోకి వెళ్ళిపోయారు.
దీంతో ధర్మవరం టీడీపీ ఇంచార్జ్‌గా శ్రీరామ్‌కు బాధ్యతలు అప్పగించారు. అటు రాప్తాడు బాధ్యతలు పరిటాల సునీతమ్మ చూసుకుంటున్నారు. ఇలా పరిటాల ఫ్యామిలీ చేతికి రెండు సీట్లు వచ్చాయి. ఇక వచ్చే ఎన్నికల్లో రెండు సీట్లలో పరిటాల ఫ్యామిలీ పోటీ చేస్తుందని అంతా అనుకున్నారు.. కానీ ఇటీవల బీజేపీ నేత సూరి టీడీపీలోకి వచ్చి ధర్మవరం సీటు తీసుకుంటారని ప్రచారం జరిగింది.
ఇక సూరి టీడీపీలోకి వచ్చిన సరే ధర్మవరం సీటు తనదే అని శ్రీరామ్ చెప్పారు…ఒకవేళ సీటు దక్కకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని కూడా చెప్పేశారు. ఆ తర్వాత ఈ సీటు విషయంలో రచ్చ నడుస్తూనే ఉంది..అయితే ధర్మవరంలో శ్రీరామ్ ప్రజా సమస్యలపై పోరాటాలు తీవ్ర స్థాయిలో చేస్తున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు కూడా ధర్మవరం సీటు పరిటాలకి ఇస్తేనే బెటర్ అని ఫిక్స్ అయ్యారు. దీంతో ధర్మవరం టీడీపీ అభ్యర్ధిగా శ్రీరామ్‌ని ఫిక్స్ చేశారు. అంటే నెక్స్ట్ ఎన్నికల్లో రాప్తాడులో సునీతమ్మ, ధర్మవరంలో శ్రీరామ్ పోటీ చేయనున్నారు.
ఇక ధర్మవరంలో వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి చాలా స్ట్రాంగ్‌గా ఉన్న విషయం తెలిసిందే. ఆయనకు కాస్త ప్రజా మద్ధతు ఎక్కువ కనిపిస్తోంది. మరి ఇలా ప్రజా మద్ధతు ఎక్కువ ఉన్న కేతిరెడ్డిని ఓడించడం అనేది చాలా కష్టమైన పని. కేతిరెడ్డికి చెక్ పెట్టాలంటే శ్రీరామ్ ఇంకా కష్టపడాల్సిన అవసరం ఉంది. మరి చూడాలి ధర్మవరంలో కేతిరెడ్డిని శ్రీరామ్ నిలువరించగలరో లేదో.

Read more RELATED
Recommended to you

Exit mobile version