AP : డీఎస్సీ అభ్యర్థులకు శుభవార్త..

-

ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని గిరిజన అభ్యర్థులకు శుభవార్త కు చెప్పింది.అర్హత కలిగి ఉన్నత చదువులు, ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని పట్టుదలతో ఉన్నవారికి ఉచిత ట్రైనింగ్ సదుపాయం కల్పించనున్నట్లు ప్రకటించింది.ఈ నేపథ్యంలోనే డీఎస్సీ (టీచర్)కు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఏజెన్సీ ప్రాంతాల్లోని 6 ఐటీడీఏల్లో గిరిజనేతరుల ప్రాంతాల్లో రెండు లేదా మూడు సెంటర్లు ఏర్పాటు చేయనుంది.

ఒక్కో కేంద్రంలో 150 మందికి శిక్షణ ఇవ్వనున్నారు. ఇలా మూడు నెలల పాటు సాగే శిక్షణకు ఒక్కో అభ్యర్థికి రూ.25 వేల వరకు ఖర్చు కానుంది.దీనిని రాష్ట్ర ప్రభుత్వమే భరించనున్నట్లు పేర్కొంది. అయితే, రాష్టంలో 16,347 డీఎస్సీ పోస్టుల భర్తీకి ఏపీ ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఇదిలాఉండగా, రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఈ ట్రైనింగ్ ప్రక్రియ తేదీలను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version