యాంకర్ శివజ్యోతి అక్రమ సంపాదన రూ.5 కోట్లు.. నా అన్వేషణ అన్వేష్ సంచలన ఆరోపణ

-

యాంకర్ శివజ్యోతిపై ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ అన్వేష్ సంచలన ఆరోపణలు చేశారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి శివ జ్యోతి అక్రమంగా డబ్బులు సంపాదించిందని.. దాని విలువ రూ.5 కోట్లు ఉంటుందన్నారు. ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్‌లో ఓ వీడియోను పోస్టు చేశారు.

గతంలో ఓ మీడియా చానెల్‌లో బిత్తిరి సత్తితో కలిసి యాంకరింగ్, షోలు చేసిన శివజ్యోతి .. సడన్‌గా కోటీశ్వరురాలు అయ్యారంటే దానికి కారణంగా బెట్టింగ్ యాప్స్ అన్నారు. రూ. 5 కోట్ల విలువైన అపార్ట్మెంట్‌ న బంజారాహిల్స్‌లో శివ జ్యోతి కొన్నారని.. బీఎండబ్ల్యూ కారు కూడా కొన్నారని చెప్పాడు. తన సొంత గ్రామంలో 10 ఎకరాల భూమి కూడా శివ జ్యోతి కొనుగోలు చేసిందని ఆరోపించారు. ఈ డబ్బులన్నీ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్లే సంపాదించిందని.. ఇకపై ఇలాంటి పనులను శివ జ్యోతి అక్క మానేయాలని అన్వేష్ పేర్కొన్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version