ప్రభుత్వ ఉద్యోగులు సమయానికి రావాలి.. తమ విధులను సక్రమంగా నిర్వహించాలని ఏ ప్రభుత్వం అయినా కోరుకుంటుంది. ఉద్యోగులతో సరిగ్గా పనిచేయించుకోవడం ప్రభుత్వం బాధ్యత. ఇదిలా ఉంటే ప్రభుత్వ ఉద్యోగులు సమయానికి రారు అనే భావన చాలా మంది ప్రజల్లో ఉంది.
ఇదిలా ఉంటే ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆర్థిక శాఖ ఉద్యోగులు కరెక్ట్ టైంకు ఆఫీసుల్లో ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి ఆర్థిక శాఖ ఉత్తర్వులను కూడా జారీ చేసింది. రాష్ట్ర సచివాలయ ఆర్థిక శాఖ అధికారులు నిర్ణీత సమయంలో కార్యాలయాలకు రావాలని.. లేకపోతే సెలవు కిందే పరిగనిస్తామని ఆదేశాాలు జారీ చేసింది రాష్ట్ర ఆర్థిక శాఖ. ఉదయం 10.10 గంటలక కన్నా ఆఫీసుకు రావాాలని… సాయంత్రం 5.30 గంటల వరకు తప్పని సరిగా విధులు నిర్వహించాలని స్పష్టం చేసింది. ఉదయం 10.10 గంటల నుంచి 11 గంటల వరకు హాజరుకు నెలలో మూడు సార్లు మాత్రమే అవకాశం ఇస్తామని స్పష్టం చేసింది.