ఆంధ్ర ప్రదేశ్ లో వార్డు వాలంటీర్ వ్యవస్థపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. వార్డు వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తున్నట్లు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది.ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు అందించేందుకు వార్డు వాలంటీర్లను కొనసాగించనున్నట్లు ,ప్రతి నెలా ఇంటి వద్దనే పింఛన్ అందజేస్తామని ప్రకటించింది. అయితే ఈ వ్యవస్థపై సమీక్షించ జరిపి త్వరలో చేపడతామని పేర్కొంది. అలాగే శాఖల వారీగా శ్వేత పత్రాలను రిలీజ్ చేస్తామని మంత్రి బాలా వీరాంజనేయ స్వామి తెలిపారు.
కాగా, గత వైయస్ జగన్ ప్రభుత్వం వార్డు వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చింది. వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఇంటి వద్దనే పింఛన్ నగదును అందజేసింది. అయితే వార్డు వాలంటీర్లు వైసీపీ నాయకులకు అనుకూలంగా వ్యవహరించారని ఆరోపణలు వచ్చాయి.దీంతో అప్పటి ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే వార్డు వాలంటీర్ల వ్యవస్థను ప్రక్షాళన చేస్తామని వార్నింగ్ ఇచ్చారు . అయితే కొన్ని కారణాల వల్ల తాము అధికారంలోకి వస్తే పింఛన్‌దారులకు ఇంటి వద్దే నగదు అందజేస్తామని కూటమి నాయకులు హామీ ఇచ్చారు. ఈ మేరకు ఎన్నికల్లో కూటమి ఎమ్మెల్యేలు గెలుపొందారు.