జగన్ ఒక్క బటన్ నొక్కితే 354 కోట్లు..! ‘వైఎస్సార్‌ కాపు నేస్తం’ షురూ..!

-

ysr kapu nestam scheme launched in AP
ysr kapu nestam scheme launched in AP

కోవిడ్ రాష్ట్ర నిధులను కుళ్లగొట్టినా ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నాడు ఏ‌పీ ముఖ్యమంత్రి వై‌ఎస్ జగన్. ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తూ నవరాట్నాలను సరిగ్గా అమలు చేస్తూ ముందుకు దూసుకుపోతున్నాడు. ఈనేపద్యంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం నేడు ‘వైఎస్సార్‌ కాపు నేస్తం’ పథకాన్ని అమలు చేయనున్నారు. ఈ పథకం ప్రకారం దారిద్ర్య రేఖకు దిగువునున్న అర్హులైన కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు చెందిన మహిళల్లో 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న వారికి ప్రతీ సంవత్సరం 154 రూపాయల చొప్పున ఐదు సంవత్సరాలకు కలిపి 75 వేల రూపాయల ప్రభుత్వం తరఫున సహాయం దక్కుతుంది. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం వారి జీవనోపాధిని పెంచి వారి జీవనాన్ని మెరుగుపరచడం. ఈ పథకం ద్వారా 2,35,875 మహిళలు ఉపాధి పొందుతున్నారు. ముఖ్యమంత్రి జగన్ కేవలం ఒక్క బటన్ నొక్కడం ద్వారా వారి బ్యాంకు ఖాతాల్లోకి డబ్బు నేరుగా వెళ్లిపోతుంది. ‘వైఎస్సార్‌ కాపు నేస్తం’ పథకం లోని మొదటివిడుటకు గాను నేడు ప్రతీ ఒక్కరి అకౌంట్లలో 15 వేలు చొప్పున మొత్తగా 354 కోట్ల రూపాయలు జమచేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version